మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Dharma Sastha Stuti Dasakam – శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం


ఆశానురూపఫలదం చరణారవింద-
-భాజామపార కరుణార్ణవ పూర్ణచంద్రమ్ |
నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య-
-మీశానకేశవభవం భువనైకనాథమ్ || 1 ||

పింఛావలీ వలయితాకలితప్రసూన-
-సంజాతకాంతిభరభాసురకేశభారమ్ |
శింజానమంజుమణిభూషణరంజితాంగం
చంద్రావతంసహరినందనమాశ్రయామి || 2 ||

ఆలోలనీలలలితాలకహారరమ్య-
-మాకమ్రనాసమరుణాధరమాయతాక్షమ్ |
ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ-
-మానమ్రలోక హరినందనమాశ్రయామి || 3 ||

కర్ణావలంబి మణికుండలభాసమాన-
-గండస్థలం సముదితాననపుండరీకమ్ |
అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం
పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి || 4 ||

ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం
కోదండబాణమహితాంతమదాంతవీర్యమ్ |
ఉద్యత్ప్రభాపటలదీప్రమదభ్రసారం
నిత్యం ప్రభాపతిమహం ప్రణతో భవామి || 5 ||

మాలేయపంకసమలంకృతభాసమాన-
-దోరంతరాళతరళామలహారజాలమ్ |
నీలాతినిర్మలదుకూలధరం ముకుంద-
-కాలాంతకప్రతినిధిం ప్రణతోఽస్మి నిత్యమ్ || 6 ||

యత్పాదపంకజయుగం మునయోఽప్యజస్రం
భక్త్యా భజంతి భవరోగనివారణాయ |
పుత్రం పురాంతకమురాంతకయోరుదారం
నిత్యం నమామ్యహమమిత్రకులాంతకం తమ్ || 7 ||

కాంతం కలాయకుసుమద్యుతిలోభనీయ-
-కాంతిప్రవాహవిలసత్కమనీయరూపమ్ |
కాంతాతనూజసహితం నిఖిలామయౌఘ-
-శాంతిప్రదం ప్రమథనాథమహం నమామి || 8 ||

భూతేశ భూరికరుణామృతపూరపూర్ణ-
-వారాన్నిధే వరద భక్తజనైకబంధో |
పాయాద్భవాన్ ప్రణతమేనమపారఘోర-
-సంసారభీతమిహ మామఖిలామయేభ్యః || 9 ||

హే భూతనాథ భగవన్ భవదీయచారు-
-పాదాంబుజే భవతు భక్తిరచంచలా మే |
నాథాయ సర్వజగతాం భజతాం భవాబ్ధి-
-పోతాయ నిత్యమఖిలాంగభువే నమస్తే || 10 ||

ఇతి శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.